వీడిన జైపాల్ రెడ్డి కోడలి హత్య మిస్టరీ: భర్త చైతన్య రెడ్డి అరెస్టు

దిండును ఊపిరి ఆడకుండా అడ్డం పెట్టడంతో కిరణ్ రెడ్డి మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నాలుగు రోజులుగా ఈ విషయంపై మాట్లాడని చైతన్య రెడ్డి బుధవారం తాను కొట్టినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు చైతన్యను అరెస్టు చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు. అయితే మరోవైపు ఆయన మీడియాలో తాను చంపానన్న విషయాన్ని ఖండించారు. తాను తన భార్యను ప్రాణంగా ప్రేమించానని అన్నాడు. తనను బలవంతంగా ఈ కేసులో ఇరికించారని చెప్పాడు. తనకు ఏ పాపం తెలియదని చెబుతున్నాడు.












Click it and Unblock the Notifications