జైపాల్ రెడ్డి కోడలు కిరణ్ రెడ్డికి భర్తతో నిత్యం వేధింపులే!: విచారణలో వెల్లడి

కిరణ్ పేర ఉన్న ఆస్తిని తన పేర రాయమని ఆమెను నిత్యం వేధించే వాడంట. నిలకడలేని చైతన్య ఆ తర్వాత మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి వచ్చి కిరణ్ రెడ్డిని వేధించే వాడు. ఆస్తి విషయంలో నిత్యం ఆమెతో తగాదా పడే వాడని తెలుస్తోంది. ఆరు రోజుల క్రితం కూడా మద్యం తాగి వచ్చిన చైతన్య ఆ మద్యం మత్తులో కిరణ్ రెడ్డిని చంపేసి సహజ మరణంగా చిత్రించే ప్రయత్నాలు చేశాడు. చైతన్య నిలకడలేమి కారణంగా కిరణ్ కూడా పలుమార్లు చైతన్యను హెచ్చరించింది. కానీ చైతన్య తన పద్దతి మాత్రం మార్చుకోలేదు. కాగా ఈ నెల 26న కిరణ్ రెడ్డి సోదరుడు సునీల్ వివాహం ఉంది. అయితే వివాహానికి పది రోజుల ముందే కిరణ్ హత్య ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కాగా చైతన్యకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.












Click it and Unblock the Notifications