ఫైనాన్షియర్ల వల్ల చిక్కిన సింగనమల రమేష్, విక్రమ్‌తో భారీ సినిమా

తెలుగు సినీ నిర్మాత సింగనమల రమేష్‌ను పోలీసులు శనివారంనాడు చెన్నైలో ఎగ్మోర్ కోర్టు ముందు హాజరు పరిచారు. ఆయనను ట్రాన్సిట్ వారంట్‌పై హైదరాబాదు తరలిస్తున్నారు. అంతుకు ముందు సింగనమల రమేష్ నివాసంలో సీఐడీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో అయిదు సిమ్ కార్డులు, హార్డ్ డిస్క్, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐడీ ఐజీ ఉమాపతి తెలిపారు. సిమ్‌కార్డులు మూడు మహారాష్ట్రకు చెందినవని చెప్పారు.
సింగనమలకు రెండు బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు గుర్తించామని, కోర్టు అనుమతితో లాకర్లను తెరిసి పరిశీలిస్తామని ఆయన చెప్పారు. సింగగనమల రమేష్‌ను వారెంట్‌తో హైదరాబాద్ తరలిస్తామని ఐజీ తెలిపారు. కాగా మద్దెలచెరువు సూరి హత్యకేసులో నిందితుడు భాను కదలికలపై మహారాష్ట్రలో ఆరా తీస్తున్నామని ఆయన వెల్లడించారు. చీటింగ్, బెదిరింపుల అభియోగాలపై రమేశ్‌ను సీఐడీ పోలీసులు శుక్రవారం చెన్నైలో అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో ప్రవేశపెట్టారు.












Click it and Unblock the Notifications