లగడపాటికి చుక్కెందురు: అడ్డుకున్న తెలంగాణవాదులు, లాఠీచార్జ్

Lagadapati Rajagopal
హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై పలువురు తెలంగాణవాదులు శనివారం దాడికి ప్రయత్నం చేశారు. ఓ టీవీ ఛానల్ చర్చలో పాల్గొనేందుకు వెళ్లిన లగడపాటి స్టూడియో నుంచి బయటకు వచ్చిన సమయంలో తెలంగాణవాదులు ఆయన్ను వాహనాలపై వెంబడించారు. జై తెలంగాణ, తెలంగాణ ద్రోహి లగడపాటి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేస్తూ తిరుమలగిరి వరకు వెంబడించారు. స్టూడియోకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నేరెడ్‌మెట్ నుంచి నినాదాలు అందుకున్న కార్యకర్తలు తిరుమలగిరి వద్ద ఆయన వాహనాన్ని అడ్డగించారు.

వారు ఆయనపై దాడి చేయబోయేలోగా అక్కడే ఉన్న పోలీసులు లాఠీచార్జి జరిపి విద్యార్థులు, లాయర్లను చెదరగొట్టారు. బందోబస్తులో ఉన్న నేరేడ్‌మెట్ సీఐ వెంకటరెడ్డి ఆందోళనాకారుల్ని చెదరగొట్టిన అనంతరం లగడపాటిని సురక్షితంగా ఆ ప్రాంతం నుంచి పంపేశారు. పోలీసుల లాఠీచార్జిలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. లగడపాటికి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై లాఠీచార్జి చేశారని, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శిస్తూ ఆందోళనాకారులు స్టేషన్ ఎదుట కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+