వర్ధమాన నటి రేప్, హత్య: సురేష్ అనే వ్యక్తిపై పోలీసుల అనుమానం

అశ్విని ఇంటి వద్ద చివరిసారి సురేష్ అనే వ్యక్తి కనిపించాడని స్థానికులు చెప్పారని, దాంతో అతన్ని అనుమానిస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. మొబైల్ ఆపు చేసి ఉండడం, కనిపించకుండా పోవడం వల్ల సురేష్‌పై అనుమానాలు పెరుగుతున్నాయి. వందవాసి సమీపంలోని సురేష్ గ్రామం పొన్నూరుకు పోలీసు బృందం వెళ్లింది. రెండున్నరేళ్ల క్రితం శివానందం, అశ్వినీ సైదాపేటలోని ఇంటిలో అద్దెకు దిగారు. అప్పుడు సురేష్ శివానందం కజిన్‌గా పరిచయమయ్యాడు. శివానందం లేని సమయంలో కూడా సురేష్ ఇంటికి వచ్చేవాడని స్థానికులు చెబుతున్నారు.
పోలీసుల కథనం ప్రకారం - వెల్లూరు సమీపంలోని మన్నాల్‌కు చెందిన శివానందనం, అశ్విని ఐదేళ్ల క్రితం ప్రేమలో పడ్డారు. శివానందానికి ముంబై బదిలీ అయింది. పెళ్లి చేసుకుని వారు చెన్నైకి తిరిగి వచ్చారు. అశ్విని సినిమాల్లో నటించడం శివానందానికి ఇష్టం లేదు. దాంతో ఇరువురి మధ్య తరుచూ గొడవ జరుగుతుండేది.












Click it and Unblock the Notifications