అరెస్టు భీతితో ముందస్తు బెయిల్‌కు సి. కళ్యాణ్

శింగనమల రమేష్ అరెస్టు జరిగినప్పటి నుంచి సి. కళ్యాణ్ ఎక్కడున్నారనే విషయం తెలియడం లేదు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. ఆయన సెల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉంది. భాను కిరణ్‌తో కలిసి కళ్యాణ్, శింగనమల రమేష్ భూలావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు, సినీ రంగంలో పెట్టుబడుల వ్యవహారాలు నడిపారని అనుమానిస్తున్నారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసుకు సంబంధించి సి. కళ్యాణ్ మీద కూడా ఉచ్చు బిగుస్తోందని వార్తలు వస్తున్నాయి. సి. కళ్యాణ్‌ను గతంలో పోలీసులు విచారించారు.
కాగా, శింగనమల రమేష్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. రమేష్‌ను పోలీసులు చెన్నైలో అరెస్టు చేసి హైదరాబాదుకు తీసుకుని వచ్చారు. సింగనమల రమేష్‌ను తమ కస్టడీకి విచారణ నిమిత్తం అప్పగించాలని సిఐడి పోలీసులు కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications