సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి గుడ్‌బై

సేవా మార్గంలోకి వచ్చిన తర్వాత సినిమాల్లో నటించడం భావ్యం కాదని ఆయన అన్నారు. ప్రజలు తనను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సినిమాల్లో కన్నా నిజ జీవితంలో ముఖ్యమంత్రిగా పనిచేయడం సౌకర్యంగా ఉంటుందని ఆయన అన్నారు. ఇక పూర్తి కాలం రాజకీయాల్లో కొనసాగుతానని ఆయన అన్నారు. చిరంజీవి ప్రకటనకు సినీ రంగం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సినిమాలకు చిరంజీవి రిటైర్మైంట్ ప్రకటించడం బాధాకరమని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ అన్నారు. 150వ చిత్రంలో నటించాలని తాను చిరంజీవిని కోరుతానని చిన్ని కృష్ణ అన్నారు. చిరంజీవి ప్రకటనను బట్టి కాంగ్రెసు అధిష్టానం చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తెస్తున్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications