కెసిఆర్ ఓ రౌడీనా, వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు: దానం

Danam Nagender
హైదరాబాద్: మెట్రో రైలు వస్తే రక్తపాతం సృష్టిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనడం విచారకరమని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ మంగళవారం అన్నారు. ఆయన అలా అనడానికి ఆయన ఏమైనా రౌడీనా లేక అసాంఘీక శక్తియా అని ప్రశ్నించారు. ఎవరు అడ్డు చెప్పిన అభివృద్ధి విషయంలో కాంగ్రెసు ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు.

కాగా మంత్రి గీతారెడ్డి కూడా వేరుగా తెలంగాణ అంశంపై మాట్లాడారు. తమకు ప్రత్యేక తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయం అవసరం లేదన్నారు. ఎలాంటి ప్యాకేజీలకు తాము అంగీకరించమన్నారు. జూలై 1 తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. కేంద్రం గత డిసెంబర్ 9న చేసిన స్టేట్ మెంటుకు కట్టుబడి ఉండాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+