సాయి ట్రస్టులో అక్రమాలు లేవు: శ్రీనివాసన్

బాబా సమాధిని ట్రస్టు చేపట్టడం లేదని అన్నారు. సమాధి నిర్మాణం కోసం ఓ భక్తుడు 35 లక్షల రూపాయలు రత్నాకర్‌కు అప్పగించారని అన్నారు. ఆ డబ్బులు బెంగుళూరు శంకరనారాయణ కన్సల్టెన్సీకి పంపించామని ఆ సమయంలో పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. శంకరనారాయణ కంపెనీ మొదట రుసుం తీసుకోకుండా పని ప్రారంభించిందని చెప్పారు. బాబా సమాధిని ట్రస్టు డబ్బులతో కాకుండా విరాళాలతో నిర్మించాలని ముందుగానే నిర్ణయించుకున్నామని చెప్పారు. ట్రస్టు సభ్యులం భక్తుల విరాళాలను ఎప్పుడూ డబ్బుల రూపంలో తీసుకోమని చెప్పారు. వచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేస్తామని ప్రతి పైసకు రశీదు ఉందని చెప్పారు. కాని సమాధి కోసం ఆ 35 లక్షల రూపాయలను మాత్రం నగదు రూపంలో ఇచ్చారని చెప్పారు. యజుర్ మందిరం లెక్కలు సజావుగానే సాగాయన్నారు.
నగలు, ఆభరణాలు, డబ్బుల లెక్కలు ప్రముఖుల సమక్షంలో జరిగిందని చెప్పారు. ట్రస్టుసు సంబంధించిన ఆదాయ పన్నులో ఎలాంటి జాప్యం లేదన్నారు. ట్రస్టుకు సంబంధించిన 9.75 కోట్ల ఆదాయ పన్ను కూడా చెల్లించామని చెప్పారు. యజుర్వేద మందిరంలో డబ్బులు ఉన్నట్లు తమకు తెలియదన్నారు. బాబా శివైక్యం చెందిన తర్వాతే తాము యజుర్మందిరంలోకి వెళ్లామని అప్పుడే డబ్బులు ఉన్నట్లు తెలిసిందన్నారు. బాబా మృతి తర్వాత సేవా కార్యక్రమాలు ఆగిపోతాయనే ఆందోళన అవసరం లేదన్నారు. బాబా ముందు చూపుతో అవసరమైన నిధులను ఏర్పాటు చేశారని అన్నారు. బాబా ప్రారంభించిన అన్ని సేవా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. సత్యసాయి ట్రస్టు 1972లో రిజిస్టర్ అయిందన్నారు. యజుర్మందిరంలో విదేశీ కరెన్సీ లేదన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు స్పందిస్తామని ట్రస్టు నుండి సమాధానం చెబుతామని చెప్పారు. ట్రస్టు కార్యకలాపాలు ప్రభుత్వం నిర్వహించవలసిన ఆవశ్యకత లేదన్నారు. ఆరోపణలు వచ్చాయి కాబట్టే మీడియా సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. టిటిడి దేవాలయం, సాయి ట్రస్టు సేవా సంస్థ కాబట్టి విలీనం చేయాల్సిన అవసరం లేదన్నారు. ట్రస్టు సభ్యులుగా బాబా తమని నియమించారని చెప్పారు. ఆరోపణలు వచ్చాయని రాజీనామా చేసి వెళితే బాబాకు ద్రోహం చేసినట్టే అని అన్నారు. ఇది మాకు పరీక్షా సమయం అని ఎదుర్కొని నిలబడతామని చెప్పారు. బాబా తమని నమ్మకంతో నియమించారని చెప్పారు. ప్రతి నిర్ణయాన్ని ట్రస్టు సభ్యులమంతా కలిసి ఏకగ్రీవంగా తీసుకుంటున్నామని చెప్పారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications