నటించాల్సిందేనంటూ చిరు ఇంటిముందు ఫ్యాన్స్ ధర్నా

చిరంజీవి ముఖ్యమంత్రి అయినా కాకపోయినా తమకు అభ్యంతరం లేదని కానీ ఆయన తన 150వ సినిమా మాత్రం తీయాలని వారు డిమాండ్ చేశారు. చిరు కనీసం ఒక్క సినిమాలో నటించినా తాము సంతృప్తి చెందుతామని చెప్పారు. సినిమా తీస్తానని చిరంజీవి తమకు హామీ ఇచ్చే వరకు తాము కదిలేది లేదని వారు బైఠాయించారు. కొందరు అభిమానులు చిరంజీవి ఇంట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు కూడా చేశారు. కాగా రెండు రోజుల క్రితం చిరంజీవి తాను రాజకీయాలలో బిజీగా ఉన్నందున సినిమాలు చేయడం కుదరదని చెప్పిన విషయం తెలిసిందే. చిత్రాలకు పూర్తిగా పూల్ స్టాప్ పెట్టి పూర్తిగా రాజకీయాలకు పరిమితం అవుతానని ప్రకటించారు. తన స్థానాన్ని తన తనయుడు రామ్ చరణ్ పూర్తి చేస్తాడని కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త చిరు అభిమానులు పిఆర్పీ కార్యాలయంలో భేటీ అయి అనంతరం చిరు ఇంటి ముందు ధర్నా నిర్వహించారు.












Click it and Unblock the Notifications