కొత్త పోలీసు బాస్ దినేష్ రెడ్డి, అరవింద్ స్థానంలో

దినేష్ రెడ్డి 2010లో ఐజిగా ప్రమోషన్ పొందారు. ఆయన హైదరాబాదు నగర పోలీసు కమిషనర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ అండ్ ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా ఆయన పనిచేశారు. కృష్ణా, ఖమ్మం, కర్నూలు జిల్లాల ఎస్పీగా పనిచేశారు. వరంగల్, హైదరాబాద్ రేంజ్ డిఐజిగా ఆయన పనిచేశారు. ఆయకు 2007లో పోలీసు పథకం లభించింది. అత్యంత సీనియర్ ఐపియస్ ఆఫీసర్ నందన్‌కు డిజిపిగా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే, గతంలో రెండు సార్లు పక్కన పెట్టినందున తనకు ఈసారి అవసరం లేదని నందన్ చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications