గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీపై పెదరత్తయ్య అసంతృప్తి, అంబటి బుజ్జగింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Congress Party
గుంటూరు: జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మాకినేని పెదరత్తయ్య ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో కింగ్‌గా ఉన్న పెదరత్తయ్య ఇటీవలె వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయనకు జిల్లాలో మంచి పట్టు ఉంది. అయితే చేరిన కొద్ది రోజులకే ఆయన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. జిల్లాకే చెందిన మరో నేత రావు వెంకట రమణతో పెదరత్తయ్యకు మధ్య విభేదాలు పొడసూపినట్లుగా తెలుస్తోంది.

ఇరువర్గాలు ఎవరికి వారు తమ తమ ప్రాధాన్యతను పార్టీలో పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో విసిగి పోయిన పెదరత్తయ్య పార్టీని వీడి మళ్లీ తన మాతృపార్టీ టిడిపిలోకి వెళ్లాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పెదరత్తయ్య అనుచరులు కూడా టిడిపిలో చేరాలని ఆయనపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని సమాచారం. ఆయన పార్టీ వీడకుండా ఉండేందుకు వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాంబు రంగంలోకి దిగారు. పార్టీ వీడవద్దని రత్తయ్యను బుజ్జగిస్తున్నట్టుగా తెలుస్తోంది.

English summary
It seems, Guntur district leader Makineni Pedarathaiah is very disoppointed with YSR Congress party. He is thinking return to Telugudesam. His followers also pressuring him to join in tdp. Ambati start talks with him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X