మళ్లీ వెనక్కి: టి-కాంగ్రెసు డెడ్‌లైన్ మారనుందా?

రాజీనామాలు, ఆమరణ నిరాహార దీక్షలు జూలై మొదటి వారంలో కాకుండా జూలై చివరి వారంలో చేయాలని నిర్ణయించుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. జూలై మొదటి వారంలో చేయడం కన్నా పార్లమెంటు సమావేశాలకు ముందు జూలై ఆఖరి వారంలో చేస్తే అధిష్టానం ఒత్తిడి పెంచినట్లవుతుందని టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే వారు తమ డెడ్ లైన్లను జూలై ఆఖరి వారానికి మార్చుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే టి-కాంగ్రెసుకు డెడ్ లైన్లు పెట్టడం వాటిని మార్చడం సాధారణమే అయిపోయిందని పలువురు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications