అమితాబ్ బచ్చన్ సలహాతో చిరంజీవిలో మెగా మార్పు

యాంగ్రీ యంగ్‌మాన్‌గా అమితాబ్ నటించిన పాత్రలు తనకెంతో ఇష్టమని చిరంజీవి ఈ సందర్భంగా చెప్పారు. అమితాబ్‌ను ఆదర్శంగా తీసుకుని చేసిన 'ఖైదీ'లాంటి చిత్రాలు తనను స్టార్ నాయకుణ్ని చేశాయని అన్నారు. అమితాబ్ తన అభిమాన నటుడన్నారు. చిరంజీవి 149వ చిత్రం దగ్గరే ఆగిపోవడం సరికాదని, ఆయన తప్పనిసరిగా 150వ చిత్రాన్ని చేయాలని అమితాబ్ అన్నారు. దీంతో చిరంజీవి -''150వ చిత్రంలో మీరు అతిథి పాత్రలో కనిపిస్తానంటే నేనూ నటిస్తా'' అని అన్నారు. రెండురోజుల క్రితం తాను నటించనని చెప్పినా, అభిమానులు, అమితాబ్‌ల ఒత్తిడికి తలొగ్గుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా వేదికపైనున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ - చిరు 150వ చిత్రానికి తాను దర్శకత్వం వహిస్తానని ప్రకటించారు.
150వ చిత్రం జరుగుతుండగానే 151వ చిత్రానికి చిరును ఒప్పిస్తానని, దానికి 'దొర ది లార్డ్'అని పేరు పెడతానని మరో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. చిరు 150వ చిత్రానికి రామ్‌గోపాల్ వర్మ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారు. చిరు తాజా నిర్ణయానికి కొన్ని గంటల ముందు ఆయన తనయుడు రాంచరణ్ తేజ... ''సినిమాల్లో నటించనన్న డాడీ నిర్ణయం విని నేను కూడా నిరుత్సాహానికి లోనయ్యాను'' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications