భూమి స్వాధీన వివాదం: రైతు ఆత్మహత్య యత్నం

పోలీసుల అండదండలతో ఎపిఐఐసి అధికారులు మహేశ్వరం మండలంలోని కెసి తండాలో 350 ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. వారిని రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు పక్షాలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తమకు ముందుగా నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే భూములను స్వాధీనం చేసుకోవాలని రైతులు పట్టుబట్టారు. నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే భూములను స్వాధీనం చేసుకుంటామని ఎపిఐసిసి తమతో ఒప్పందం కుదుర్చుకుందని, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications