భాను కిరణ్‌తో లింక్స్ నిజమే: శింగనమల రమేష్

కాగా శింగనమల నుండి 20 సిమ్ కార్డులను, 100 బ్లాంక్ చెక్స్ తీసుకున్నారు. మరో నిర్మాత సి.కళ్యాణ్ సైతం ఇప్పటికే భానుతో లింక్స్ ఉన్నట్లు ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. సి.కళ్యాణ్‌ను పోలీసులు శుక్రవారం సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. కాగా షాలిమార్ కంపెనీ అధినేత అష్రాఫ్ విలేకరులతో మాట్లాడుతూ తనను భానుతో కలిసి కళ్యాణ్, శింగనమల బెదరించినందువల్లే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. తన వద్ద డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. పోలీసులకు అన్ని వివరాలు అందించానని చెప్పారు. సినిమా కాఫీరైట్స్ కోసం 43 లక్షల రూపాయలు తీసుకొని ఇవ్వకుండా బెదిరించారని చెప్పారు.












Click it and Unblock the Notifications