హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఐడి కస్టడీకి శింగనమల, బినామీనే అన్న కళ్యాణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Singanamala Ramesh
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత శింగనమల రమేష్‌ను వారం రోజుల పాటు సిఐడి కస్టడీకి అప్పగించడానికి నాంపల్లి కోర్టు శుక్రవారం అనుమతించింది. శింగనమలను విచారించడానికి తమ కస్టడీకి అప్పగించాలని సిఐడి కోర్టును కోరింది. పదిరోజుల పాటు అప్పగించాలని కోరింది. అయితే కోర్టు ఏడు రోజుల పాటు సిఐడి కస్టడీకి అనుమతించింది. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌తో శింగనమలకు గల సంబంధాలను కూపీ లాగడంతో పాటు ప్రముఖ పైనాన్షియర్ వైజయంతీరెడ్డిని బెదిరించడం, షాలిమార్ వీడియోస్‌ను భారీగా ముంచినట్లు వచ్చిన విషయాలపై వారు విచారించనున్నారు.

కాగా షాలిమార్ వీడియోస్ అధినేత మహ్మద్ అష్రాప్ శుక్రవారం సిఐడి పోలీసుల ముందు హాజరయ్యారు. గతంలో సిఐడి పోలీసులకు అష్రాఫ్ శింగనమలపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నిర్మాత సి.కళ్యాణ్ తనను రూ.70 లక్షల మేర మోసం చేశాడని అష్రాప్ ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఇటీవల పోలీసులకు చిక్కిన నిర్మాత సి.కళ్యాణ్ తనకు భానుకిరణ్‌తో సంబంధాలు ఉన్నాయని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. భానుకు తాను బినామీ అని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

English summary
Producer Singanamala Ramesh sent CID custody for seven days. CID urged for ten days. Shalimar owner Mohammad Ashraf also came before CID police to told his version.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X