చిరంజీవికి రాజకీయాలు పనికి రావు: ఎంపి జయప్రద

తెలంగాణ ఇప్పుడు తక్షణ సమస్య అని, ఓ తెలుగు వ్యక్తిని మరో తెలుగు వ్యక్తి చూస్తే అసహ్యించుకునే పరిస్థితి ఉందని జయప్రద అన్నారు. తన జీవితంలో ప్రతి మలుపు వద్ద తనకు కలిసి వచ్చిందని ఆమె అన్నారు. సవాళ్లను సమర్థంగా ఎదుర్కున్నానని, అందుకు బేషరతుగా ప్రజలు చూపిన ఆదరణే కారణమని ఆమె అన్నారు. అనుకోకుండా నటి అయ్యానని, అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చానని, ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆమె అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతికూల వాతావరణం లేకపోవడంతో ఉత్తరప్రదేశ్‌కు రావాల్సి వచ్చిందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications