తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలకు కొండా సురేఖ సవాల్

చిత్తశుద్ధి ఉంటే మంత్రులు తమ రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని ఆమె అన్నారు. ఈ నెల 3వ తేదీన మంత్రులు, 4వ తేదీన శాసనసభ్యులు రాజీనామాలు చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు 11 గంటలకు రాజీనామా చేస్తే తాను అదే రోజు పదిన్నర గంటలకే రాజీనామా చేస్తానని ఆమె చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యులు కె. చంద్రశేఖర రావు, విజయశాంతి కూడా రాజీనామాలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణావాదులెవరో, ద్రోహులెవరో సోమవారం తేలిపోతుందని ఆమె అన్నారు. కడపలో జరిగే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీలో తెలంగాణపై విశ్లేషిస్తామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications