సత్య సాయి మందిరంలో తవ్వుతున్న కొద్దీ సంపద

అధికారుల ప్రమేయం లేకుండా కేవలం ట్రస్టు సభ్యులే సంపదను లెక్కించడంతో పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మందిరంలోని మిగతా గదుల్లో సంపదను అధికారుల సమక్షంలో లెక్కించారు. ప్రభుత్వ ఆదేశాలు, ట్రస్టు సభ్యుల విజ్ఞప్తి మేరకు యజుర్వేద మందిరంలో 10 గదుల్లోని సంపదను లెక్కించినట్లు జెసి అనితా రామచంద్రన్ చెప్పారు. ఇందులో వెండి నగలు 116 కిలోలు, బంగారం 905 గ్రాములు, వజ్రాల ఉంగరం ఉన్నట్లు తెలిపారు. వెండి విలువ రూ.57,96,607, బంగారం విలువ రూ.15,83,525, వజ్రాల ఉంగరం విలువ రూ.3,09,360 ఉందన్నారు. ముంబయి నిపుణులతో ఆభరణాల విలువ కట్టించామన్నారు. ఈ సంపదను సోమవారం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో జమ చేస్తామని తెలిపారు. వీటితో పాటు బాబా పట్టు వస్త్రాలు, పెన్నులు ఉన్నాయని, వీటి విలువను తర్వలో లెక్కిస్తామని చెప్పారు. యజుర్వేద మందిరం తాళాలు బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్ వద్దే ఉన్నాయి. శనివారం ఆయనే తలుపులు తెరిచారు. మందిరంలో ఉన్న 11 గదులనూ పరిశీలించినట్లు జేసీ తెలిపారు. యజుర్వేద మందిరం పక్కనే ఉన్న భవనంలోని సంపదను గురుపౌర్ణమి తర్వాత లెక్కిస్తామన్నారు.
గురు పౌర్ణమి రోజు సత్యసాయి మహాసమాధిని ప్రారంభించనున్నట్లు కౌన్సిల్ సభ్యుడు నాగానంద తెలిపారు. సర్వమతాల భక్తులు ఆరాధించేలా సమాధి నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. మరో 10 రోజుల్లో పనులు పూర్తవుతాయని, బాబా పుట్టిన రోజు వేడుకల నాటికి సమాధిపై విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications