రాజీనామాలకు చిరు సరేనన్నారు: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెసుకు చెందిన కనీసం 30 మంది తెలంగాణ శాసనసభ్యులు రాజీనామాలు చేస్తే తాను రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. రాజీనామా విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. రాజకీయ సన్యాసానికైనా దానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. కొద్ది మంది రాజీనామాలు చేయడం వల్ల ఉప ఎన్నికలు వస్తున్నాయని, ఉప ఎన్నికల్లో పాతవారే పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తున్నారని, దాని వల్ల తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదని ఆయన అన్నారు. తాము రాజీనామాలు చేస్తున్నట్లు చిరంజీవికి చెప్పామని, చిరంజీవి స్వాగతించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications