ఢిల్లీకి వెళ్లేది లేదు, వెనక్కి తగ్గేది లేదు: కోమటిరెడ్డి

అధిష్టానం తెలంగాణకు సానుకూలంగా ప్రకటన చేస్తే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ణతలు చెప్పడానికి వెళతాం. లేదంటే ఢిల్లీ వెళ్లడం మాత్రం లేదన్నారు. రాజీనామాలు ఆమోదించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. చాప్టర్ 8 తమపై ప్రారంభమైనట్లు కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. 11 గంటలకు ఖచ్చితంగా రాజీనామా చేస్తామని చెప్పారు. కాగా ఢిల్లీలో తెలంగాణ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ ఇంటిలో భేటీ అయ్యారు. అనంతరం మంద జగన్నాథం మాట్లాడారు. తాము రాజీనామాలతో సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏకవ్యాఖ్యంతో రాజీనామాలు సమర్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. సోనియా నుండి పిలుపు వచ్చినా రాజీనామా చేసిన తర్వాతే వెళతామని చెప్పారు.












Click it and Unblock the Notifications