కెసిఆర్ రాజీనామాకు కొండా సురేఖ డిమాండ్

కొన ఊపిరితో ఉన్న కాంగ్రెసు కనీసం తెలంగాణలోనైనా కనుమరుగు కాకుండా ఉండాలంటే హైకమాండ్ వెంటనే తెలంగాణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. టి-కాంగ్రెసు నేతలు రాజీనామాలు చేసి ఆమోదింప జేసుకునే వరకు రాజీనామాలపై అనుమానమే అని ఆమె అభిప్రాయపడ్డారు. తనపై కాంగ్రెసు పార్టీకి చర్యలు తీసుకునే నైతిక హక్కు లేదన్నారు. జగన్ ప్లీనరీలో తెలంగాణపై తన వైఖరి ప్రకటిస్తారని చెప్పారు. తన రాజీనామాకు జగన్ నుండి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. జగన్ తమకు భావస్వేచ్ఛ ఇచ్చాడని అన్నారు. కాగా కొండా సురేఖ తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్‌కు సమర్పించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని అన్నారు.












Click it and Unblock the Notifications