తెలంగాణ రాజీనామాలపై లగడపాటి నో కామెంట్

తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మనుగడకు ఏ విధమైన డోకా లేదని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. ప్రభుత్వాలు కొసాగుతాయని ఆమె సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వారి రాజీనామాలను ఆమోదించిన తర్వాత ఉన్నవారే లెక్కకు వస్తారు కాబట్టి ప్రభుత్వాలు పడిపోవని ఆమె అన్నారు. తెలంగాణపై అందరు కూడా తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications