చెప్పుల దండలు వేస్తాం: ఒయు జెఎసి హెచ్చరిక

ఈ నెల 10వ తేదీలోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటన వెలువడకపోతే ఈ నెల 11వ తేదీ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ముందు వేల మంది విద్యార్థులతో సామూహిక ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని వారు చెప్పారు. తెలంగాణ ఇస్తారా.. ప్రాణాలు తీస్తారా అనే నినాదంతో తాము ఉద్యమిస్తామని వారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాజకీయ జెఎసి ఇచ్చిన ఆందోళనా కార్యక్రమానికి వారు మద్దతు ప్రకటించారు.












Click it and Unblock the Notifications