హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామాకు సబితా వెనుకడుగు!: అధిష్టానంపై ఆరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామాకు సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని సమష్టి ఆలోచనతో ముందుకు వెళతామని ఆమె గతంలో చెప్పారు. అయితే టి-కాంగ్రెసు నేతలు రాజీనామాకు సిద్ధమైనప్పటికీ ఆమె మాత్రం రాజీనామాకు వెనుకడుగు వేయనున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆదేశాలపై ఆమె ఆరాతీస్తున్నట్లుగా తెలుస్తోంది. అధిష్టానం స్టాండ్ ఎలా ఉంది, ఏం చెబుతోంది అనే విషయాలపై సబితారెడ్డి ఆరాతీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె తీరు రాజీనామాకు వెవక్కి తగ్గే విధంగానే కనిపిస్తోందని సమాచారం. తనకు మంత్రిగా బాధ్యతలు ఉన్నాయని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక మరో మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సైతం సమిష్టి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. అయితే కాంగ్రెసులో ఉన్న వారిలో దాదాపు 30 నుండి 35 మంది వరకు రాజీనామా చేయవచ్చునని తెలుస్తోంది. అయితే సునీత అందరు రాజీనామా చేస్తే చేస్తారా లేదా వేచి చూడాల్సి ఉంది. ఇక కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సైతం రాజీనామాకు సుముఖంగా లేరని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ నుండి కేవలం జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు విష్ణువర్దన్ రెడ్డి మాత్రమే రాజీనామాకు సిద్ధమయ్యారు. మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ తదితరులు ఎవరూ రాజీనామాకు సిద్ధంగా లేరు.

English summary
It seems, home minister Sabitha Reddy is step back to resignation for Telangana. Only Vishnuvardhan Reddy was ready to resign from Greater Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X