రాజీనామాలకు తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేల మెలిక

మెజారిటీ కాంగ్రెసు శాసనసభ్యులు రాజీనామాలు చేస్తేనే రాజ్యాంగ సంక్షోభం వస్తుందని, లేకుంటే ఉప ఎన్నికలు వస్తాయని, రాజ్యాంగ సంక్షోభం వచ్చే విధంగా మూకుమ్మడి రాజీనామాలు చేయాలని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు అంటున్నారు. ఓ పది మంది రాకపోయినా సరే, మిగతా కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులంతా రాజీనామాలకు సిద్ధపడాలని వారు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు మహేశ్వర రెడ్డి, అనిల్ కూడా ఇదే వాదన చేస్తున్నారు. కాగా, తాజా పరిణామాలపై చర్చించడానికి తెలుగుదేశం తెలంగాణ పోరం సోమవారం ఉదయం పది గంటలకు సమావేశం కానుంది.












Click it and Unblock the Notifications