తెలంగాణ ఎమ్మెల్యేల రాజీనామాలు మొదలు, గండ్ర బోణీ

Gandra Venkataramana Reddy
హైదరాబాద్‌: కాంగ్రెసు తెలంగాణ శానససభ్యుల రాజీనామాలు ప్రారంభమయ్యాయి. వరంగల్లు జిల్లా భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి బోణీ కొట్టారు. అమెరికాలో ఉన్న ఆయన ఫాక్స్ ద్వారా తన రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్‌కు పంపించారు. దివంగత కాంగ్రెసు నేత పి. జనార్దన్ రెడ్డి తనయుడు, హైదరాబాదులోని జూబిలీహిల్స్ శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా రాజీనామా లేఖను సమర్పించారు. తన రాజీనామానే మొదట ఆమోదించాలని ఆయన కోరుతున్నారు.

కాంగ్రెసు శాసనసభ్యులు రాజీనామాల నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేయడమే కాకుండా అందుకు కార్యాచరణను ప్రారంభించారు. తెలుగుదేశం తిరుగుబాటు శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డితో పాటు తెలుగుదేశం శాసనసభ్యులు హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న, వేణు గోపాలాచారి ఆదివారమే రాజీనామా లేఖలు సమర్పించారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల రాజీనామా లేఖలు సిద్ధమయ్యాయి. పార్లమెంటు సభ్యులు ఏకవాక్య రాజీనామాలను సమర్పించేందుకు సిద్ధపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+