9 మంది కాంగ్రెసు టి-ఎంపీల రాజీనామా

రాజీనామా సమర్పించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నాతో సహా మొత్తం పది మందిమి రాజీనామా చేశామని కెకె చెప్పారు. కేంద్రమంత్రి చిదంబరం మధ్యాహ్నం చేసిన ప్రకటనను ఆయన కొట్టి పారేశారు. చిదంబరం కొత్తగా చెప్పిందేమీ లేదన్నారు. తెలంగాణపై అధిష్టానం డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలన్నారు. అధిష్టానం మాట నిలబెట్టుకోనందుకే రాజీనామాలు చేశామన్నారు. అధిష్టానంతో చర్చంచేదీ ఏమీ లేదని మరో ఎంపీ మందా జగన్నాథం అన్నారు. విద్యార్థుల బలిదానం వృధా కానివ్వమని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాగా రాజ్యసభ సభ్యుడు కెకె ఇప్పటికై రాజీనామాచేశారు. రాజ్యసభ సభ్యులు నంది ఎల్లయ్య, వి హనుమంతరావు, ఎంకె ఖాన్, సంజీవరెడ్డి, లోకసభ సభ్యులు సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి రాజీనామాలు చేయలేదు.


Click it and Unblock the Notifications