రాజీనామా చేసినా మంత్రులుగా కొనసాగుతారా?

మంత్రులు తమ రాజీనామాలు గవర్నర్‌కు ఇవ్వవలసి ఉంటుంది. కానీ వారు గవర్నర్ అపాయింటుమెంటు కోరలేదు. గవర్నర్ కార్యాలయ వర్గం కూడా అదే చెబుతోంది. ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవికీ రాజీనామా చేయాలనుకుంటే వారు అప్పుడే గవర్నర్‌కు రాజీనామా సమర్పించాల్సిన అవసరం ఉంది. కాని వారు అలా చేయలేదు. ఎమ్మెల్యే పదవి లేకున్నప్పటికీ మంత్రిగా ఆరు నెలలు కొనసాగే అవకాశం ఉంది. అందుకే వారు రాజీనామా చేయనట్టుగా తెలంగాణవాదులు భావిస్తున్నారు. రాజీనామా ఆమోదమా, తెలంగాణ ఇవ్వడమా లేదా ప్రభుత్వం పడిపోయి రాష్ట్రపతి పాలన రావడమా ఇవే జరుగుతాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేయడం ఎందుకని వారు భావించినట్లుగా తెలుస్తోంది. అయితే మంత్రి పదవులకు రాజీనామా చేయని మంత్రులు సచివాలయానికి వెళతారా లేదా చూడాలి.












Click it and Unblock the Notifications