సిపిఐ ఎమ్మెల్యేల రాజీనామా, సీమాంధ్రకు హితవు

CPI Logo
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిపిఐ పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు మంగళవారం మధ్యాహ్నం రాజీనామా చేశారు. పార్టీ శాసనసభా పక్ష నేత గూండా మల్లేష్, యాదగిరి రావు, చంద్రావతి శాసనసభా కార్యదర్శి సదారాంను కలిసి రాజీనామాలు సమర్పించారు. మరో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఫాక్స్ ద్వారా తమ రాజీనామాలను స్పీకర్ కార్యాలయానికి పంపించారు. ఈసందర్భంగా వారు కాంగ్రెసుపై ధ్వజమెత్తారు. దివంగత ప్రధాని తెలంగాణ ఇస్తామని చెప్పి చెన్నారెడ్డితో కలిసి మోసం చేసిందని ఆరోపించారు. శ్రీకృష్ణ కమిటి తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇస్తుందని భావిస్తే ఆ కోరిక నెరవేరలేదన్నారు. కాంగ్రెసు తెలంగాణపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్నారు.

చిదంబరం అఖిలపక్షానికి వెళ్లిన తాము తెలంగాణ ఇవ్వాలని లిఖిత పూర్వకంగా రాసిచ్చామని చెప్పారు. దేశాన్ని ఏలుతున్న కాంగ్రెసు పార్టీ 55 ఏళ్ల తెలంగాణ సమస్యను పరిష్కరించక పోవడం చేతకానితనం అని ధ్వజమెత్తారు. టిడిపి, కాంగ్రెసు వల్లే తెలంగాణ సమస్య జఠిలమైందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం ఉన్నదా లేదా అనే ఈ పరిస్థితులో తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారన్నారు. తెలంగాణ ప్రజల కోసం నిత్యం పాటుపడుతున్న పార్టీ సిపిఐ పార్టీ అన్నారు. దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారన్నారు. నాటి నుండి నేటి వరకు తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్నామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను చూస్తూ కూర్చోమన్నారు. తెలంగాణ కోసం రాజీనామాల విషయంలో మా పార్టీ సభ్యుల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. తెలంగాణ వచ్చే వరకు ఉద్యమిస్తామన్నారు. రాజీనామాలకు మా పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. ఆంధ్రా, రాయలసీమ ప్రజలకు ఎవరూ వ్యతిరేకం కాదన్నారు. సీమాంధ్ర ప్రజలు కొందరు నేతల కుట్ర అర్థం చేసుకోవాలని కోరారు.

కాగా అంతకుముందు కాంగ్రెస్‌, తెదేపా ప్రజాప్రతినిధుల రాజీనామాలను కేంద్ర హోంమంత్రి చిదంబరం తేలిగ్గా తీసుకోవటం బాధ్యతారాహిత్యమని సిపిఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. ఈ అలసత్వం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. వర్షాకాల సమావేశాల్లోగా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టి-టిడిపి శాసనసభ్యులు చంద్రబాబుకు తెలియకుండా రాజీనామా చేశారని తాము అనుకోవడం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+