రాజీనామాలతో కెసిఆర్ రికార్డు సృష్టించారు: హరీష్

గతంలో కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీ నేతలంతా రాజీనామా చేసినప్పటికీ టిఆర్ఎస్ వాళ్ల రాజీనామాలే ఆమోదించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజాప్రతినిధులు ఒక్కత్రాటిపైకి వచ్చి రాజీనామాలు చేయడం మంచిందన్నారు. మిగతా వారు కూడా రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. కాగా ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్, విజయశాంతిలకు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ కోదండరామ్ అభినందనలు తెలిపారు. రాజీనామాలు చేసిన తెలంగాణ ఎమ్మెల్యేలందరితోను ఓ ఫోరం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆయన మంగళవారం ఇక్కడ అన్నారు. ఇంకా రాజీనామాలు చేయని నేతలు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని కోదండరామ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications