ఒత్తిడికి తలొగ్గి కొండా మురళి రాజీనామా

తెలంగాణవాదుల ఒత్తిడికి తలొగ్గిన కొండా మురళీ మంగళవారం తన రాజీనామాను సమర్పించారు. దిలీప్ కుమార్ సైతం రాజీనామా చేస్తానని తెలంగాణవాదులకు హామీ ఇచ్చారు. మరో ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి రాజీనామా సందిగ్ధంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణవాదుల నుండి తీవ్ర ఒత్తిడి వచ్చినప్పటికీ ఆమె ఎటూ తేల్చుకోలేక పోతోందని సమాచారం. కాగా ఇప్పటి వరకు 15 మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. కొండా మురళీ రాజీనామాతో అది 16కు చేరింది. పుల్లా పద్మావతి, దిలీప్ కుమార్ చేస్తే 18కి చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications