హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి శంకర రావు రాజనామా, 108కి చేరిన కౌంట్

By Pratap
|
Google Oneindia TeluguNews

P Shankar Rao
హైదరాబాద్‌: రాజీనామా విషయంలో మంత్రి పి. శంకర రావు దిగి వచ్చారు. ఆయన తన మంత్రి పదవికి, శానససభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తూ తన లేఖను ఆయన అమెరికా నుంచి ఫాక్స్ ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పంపించారు. శానససభా సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తన లేఖను స్పీకర్ కార్యాలయానికి ఫాక్స్ చేశారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన వాదిస్తూ వచ్చారు. రాజీనామాల సంఖ్య వందకు పైగా కావడంతో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

కాగా, తెలంగాణ కోసం రాజీనామా చేసిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీల సంఖ్య 108కి చేరుకంది. సోమవారం రాత్రి వరకు 10 మంది పార్లమెంటు సభ్యులు, 81 మంది శాసనసభ్యులు, 15 మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా, తాజాగా కెసిఆర్, శంకర రావు రాజీనామాలు చేశారు. దీంతో రాజీనామా చేసిన పార్లమెంటు సభ్యుల సంఖ్య 11కు చేరుకోగా, శాసనసభ్యుల సంఖ్య 82కు చేరుకుంది. మొత్తం రాజీనామాల సంఖ్య 108కి చేరింది. ఆర్టీసి చైర్మన్ ఎం. సత్యనారాయణ రావు, వరంగల్లు జిల్లా పరిషత్ చైర్మన్ ధన్వంతరి రాజీనామాలు ఈ లెక్కలోకి రాలేదు.

English summary
Minister P shankar Rao has resigned as minister and MLA. With this the resignations count goes upto 108.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X