రాజీనామా చేసిన మంత్రులను బుజ్జగిస్తున్న సిఎం!

ముఖ్యమంత్రి మంత్రులతో పాటు శాసనసభ్యులతో సైతం మాట్లాడినట్లుగా తెలుస్తోంది. మంత్రులు, శాసనసభ్యులతో గంటపాటు మాట్లాడి రాజీనామాలను ఉపసంహరించుకోవాలని, బాధ్యతలు నిర్వహించాలని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే బాధ్యతలు నిర్వహించాలని సూచించిన సిఎంకు మంత్రులు ఎలాంటి సమాధానం చెప్పనట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్నందునే తాము తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేశామని, బాధ్యతలు నిర్వహిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని వారు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications