మందకృష్ణకు ఒయు జెఎసి నేత పిడమర్తి రవి కౌంటర్

Pidamarthi Ravi
హైదరాబాద్‌‌: తమకు దొరల తెలంగాణ వద్దని, సామాజిక తెలంగాణ కావాలని వ్యాఖ్యానించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పియస్) వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి నేత పిడమర్తి రవి కౌంటర్ ఇచ్చారు. సామాజిక వర్గాన్ని ముందుకు తెచ్చి తెలంగాణను అడ్డుకోవడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయత్నాలు మానుకోవాలని ఆయన బుధవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ఉద్యమానికి కులం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో దళిత నాయకులపైనే దాడులు జరుగుతున్నాయనే విమర్శను కూడా ఆయన ఖండించారు. నాగం జనార్దన్ రెడ్డిపై విద్యార్థులు దాడి చేశారని, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పలుమార్లు తెలంగాణవాదులు అడ్డుకున్నారని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా అడ్డుకున్నారని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ ఉద్యమంలో కుల ప్రస్తావన తేవడం సరి కాదని ఆయన అన్నారు. కులాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న దామోదర రాజీనామా నర్సింహ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దామోదర రాజనర్సింహనే ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ కూడా వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామాలు చేయని ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లి నిలదీస్తామని ఆయన చెప్పారు. విద్యార్థులను రెచ్చగొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఒయు జెఎసి మరో నేత కిశోర్ అన్నారు. ఈ నెల 11వ తేదీన విశ్వవిద్యాలయంలో వేలాది మంది విద్యార్థులు దీక్ష చేపడతారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+