చర్చల ప్రక్రియ వెల్లడించేది కాదు: తెలంగాణపై ఆజాద్

ghulam nabi azad
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యను ఎలా పరిష్కరిస్తామనేది మీడియాకు వెల్లడించేది కాదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు. సంప్రదింపుల ప్రక్రియకు మార్గదర్శక సూత్రాలను కూడా మీడియాకు వెల్లడించలేమని ఆయన గురువారం సాయంత్రం అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించి తీరుతామని, అది చర్చల ద్వారానే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. రోడ్ మ్యాప్‌ను మీడియాకు వెల్లడించలేమని ఆయన అన్నారు. సంప్రదింపుల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని, తమ పార్టీ శానససభ్యులందరితో మాట్లాడుతామని ఆయన అన్నారు.

తెలంగాణ అంశంపై తమ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతామని ఆయన అన్నారు. సంప్రదింపుల కమిటీ ఖరారు కాలేదని, మరో కమిటీని గానీ మరో సమన్వయ కమిటీని గానీ వేసే ఉద్దేశం లేదని ఆయన చెప్పారు. తెలంగాణ అంశంపై తమ కోర్ కమిటీ పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభ నివారణకు ఏ విధమైన చర్యలూ చేపట్టలేదని ఆయన చెప్పారు.

కాగా, సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివ రావు, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి తదితరులు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+