ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్న నగ్న చిత్రం

Optical Illusion
అరెరె.. ఏంటీ ఈ అమ్మాయి ఇలా బట్టలు లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చేస్తోంది. ఇదేం పాడు పని కొంచెం కూడా సిగ్గు లేకుండా అనుకుంటున్నారా..! అయితే మీరు ఫోటోలో కాలేసినట్లే.. అదెలా అంటారా...?? అయితే, ఈ ఫోటోను మరోసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఏదైనా తేడా కనిపించిందా..! ఆ... ఇప్పుడు అర్థమైందా.. మీ కళ్లు మిమ్మల్ని మోసం చేశాయని. ఇదొక ఆప్టికల్ ఇల్యూషన్ (దృష్టిభ్రాంతి).

ఈ ఫోటోలో నగ్నంగా కనిపిస్తున్నట్లున్న ఆ అమ్మాయి ముందువైపు ఓ ఊబకాయపు స్త్రీ ఉంది గమనించారా..! తన చేతిని పట్టుకొని వెనుకవైపు స్లీవ్‌లెస్ డ్రెస్ వేసుకొని నిలుచుని ఉన్న అమ్మాయే చిత్రంలో నగ్నంగా కనిపిస్తున్నట్లు భ్రాంతిని కల్పిస్తోంది. కొందరు స్నేహితులు కలిసి సరదాగా తీసిన ఈ భ్రాంతికర ఫోటో ఇప్పుడు అంతర్జాలం (ఇంటర్నెట్‌లో) హల్‌చల్ చేస్తోంది.

ఈ ఫోటోలో ముందువైపు ఉన్న అమ్మాయికి ఊబకాయం వల్ల ఏర్పడిన తన చేతి మడతలు వెనుకవైపు దాగి ఉన్న అమ్మాయిని నగ్నంగా కనిపించేలా భ్రాంతి గొలుపుతున్నాయి. దీంతో ఆసక్తిగా ఈ చిత్రాన్ని వీక్షించడానికి వచ్చిన నెటిజన్లు అసలు విషయం తెలుసుకొని ఔరా అని ముక్కున వేలేసుకుంటాన్నారు. ఇదంతా కేవలం భ్రాంతి.. భ్రమేనా అంటూ నిట్టూరుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+