రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

Heavy Rains
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 48 గంటల పాటు భారీగా వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున రాష్ట్రానికి భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. అన్నదాతలు వ్యవసాయ పనుల్లో బిజీ అయిపోయారు. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. వరంగల్ జిల్లాలోని ములుగు ప్రాంతంలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గుడివాడ, పరకాలలో 10 సెంటి మీటర్లు, భద్రాచలం, జగిత్యాల, పొదిలిలో 8 సెంటీమీటర్లు, నిజామాబాద్, నర్సీపట్నం, మంగళగిరిల్లో 7 శాతం వర్షం పడింది.

భారీ వర్షాల కారణంగా తీరప్రాంతాలలోని 50 మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రూ.కోటికి పైగా ఆస్తి నష్టం జరిగింది. కాగా అదిలాబాదులోని బతుకమ్మ వంతెన కొట్టుకు పోయిన కారణంగా 70 గ్రామాలలో రాకపోకలు బంద్ అయ్యాయి. విశాఖలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఆర్కే బీచ్‌లోకి నీళ్లు వచ్చాయి. తీర ప్రాంతంలోని 20 బోట్లు కొట్టుకు పోయాయి.

విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణల్లో మోస్తరుగా... రాయలసీమలో పలుచోట్ల వానలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని విశాఖలో వాతావరణ కేంద్ర నిపుణులు తెలియజేశారు.

ఉత్తరాంధ్రలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. విశాఖలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విశాలాక్షినగర్‌లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు శ్రీకాకుళంలో ఉరుములతో కూడిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+