ఎంపి కృపారాణి తనయుడిపై లైంగిక వేధింపుల కేసు

Killi Kruparani
శ్రీకాకుళం: ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థినిని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యురాలు కిల్లి కృపారాణి తనయుడు వేధించారని ఆరోపిస్తూ జిల్లాలోని టెక్కలి పోలీసు స్టేషన్‌లో గురువారం కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇంజనీరింగ్ చదువుతున్న సదరు విద్యార్థినిని గత కొంతకాలంగా కృపారాణి తనయుడు క్రాంతి వేధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. క్రాంతి ఆమెపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డట్టు తెలుస్తోంది. అయితే సదరు విద్యార్థినీ ఎంతకూ లొంగక పోయేసరికి క్రాంతి ఆమెపై తనకు సంబంధించిన వారితో దాడులు కూడా చేయించారని సమాచారం.

బాధితురాలైన విద్యార్థినికి టెక్కలి శాసనభ్యురాలు కొర్ల భారతి అండగా నిలిచారు. ఎమ్మెల్యే మద్దతుతో విద్యార్థిని పోలీసు స్టేషన్‌లో క్రాంతిపై పోలీసు స్టేషన్లో కేసు పెట్టించారని తెలుస్తోంది. కాగా ఎంపీ కృపారాణి తనయుడు క్రాంతిపై ఆరోపణలు కొత్తగా రాలేదు. గతంలో కూడా చాలాసార్లు క్రాంతిపై ఆరోపణలు వచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో ఓ జర్నలిస్టుపైన సైతం క్రాంతి చేయి చేసుకున్నట్లు సమాచారం.

కాగా టెక్కలి శాసనసభ్యురాలు కొర్ల భారతి అండతోనే తన తనయుడు క్రాంతిపై టెక్కలి పోలీసు స్టేషన్‌లో అక్రమంగా కేసు బనాయించారని ఎంపీ కృపారాణి అంటోంది. తన తనయుడు ఏ అమ్మాయిని వేధించలేదని చెబుతోంది. రాజకీయ కక్షతోనే భారతి తన తనయుడిపై అమ్మాయిని వేధిస్తున్నారనే కేసు పెట్టించిందని ఆరోపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+