బస్సు యాత్ర వద్దని కోదండరామ్, కుదరదన్న ఎర్రబెల్లి

రాజీనామా చేసిన అందరు శాసనసభ్యులతో కలిసి ఓ కార్యాచరణ రూపొందిస్తున్నామని అప్పటి వరకు బస్సు యాత్రను వాయిదా వేసుకోవాలని కోదండరాం టిడిపి శాసనసభ్యులను కోరినట్లుగా తెలుస్తోంది. కార్యాచరణ రూపొందించే వరకు వేచి చూడాలని వారిని కోదండరాం కోరారు. అయితే తాము బస్సు యాత్రకు ఇప్పటికే అంతా నిర్ణయం తీసుకున్నామని సాయంత్రమే ప్రారంభమవుతున్నందున వాయిదా సాధ్యం కాదని ఎర్రబెల్లి చెప్పినట్లుగా తెలుస్తోంది. బస్సు యాత్రకు కనీసం సంఘీభావం అయినా ప్రకటించాలని వారు కోదండరాంను కోరగా ఆయన జెఏసిలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి బస్సు యాత్రపై కోదండరాం నుండి టిడిపి ఎలాంటి హామీ రాలేదు.












Click it and Unblock the Notifications