ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ర్యాలీ, ఉద్రిక్తత

తెలంగాణకు మద్దతుగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఉదయం తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా విద్యార్థులు భారీ ర్యాలీలను నిర్వహించారు. 14 ఎఫ్ రద్దు చేయాలని, తెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి అమరవీరుల స్థూపం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎంజీఎం చౌరస్తాలో వైద్యులు మానవహారం జరిపారు. మెదక్ జిల్లా సంగారెడ్డి, సిద్ధిపేటలలో విద్యార్థులు ర్యాలీలు, మాన వహారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్డీవో ఆఫీసును ఏబీవీపీ ముట్టడించింది.
ఆర్మూరు, కామారెడ్డిలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఓయూలో తలపెట్టిన ఏబీవీపీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్జీరంగా వర్సిటీలో జరుగుతున్న పీజీ పరీక్షను విద్యార్థి జేఏసీ అడ్డుకుంది. సికింద్రాబాద్ పీజీ కాలేజీ వద్ద ర్యాలీ వస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. చార్మినార్ నుంచి గన్‌పార్క్ వరకు ర్యాలీగా వస్తున్న తెలంగాణ జర్నలిస్టు ఫోరంను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు. శంషాబాద్‌లో విద్యార్థి సంఘాలు ర్యాలీ చేపట్టారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని, హుజూరాబాద్‌లో విద్యార్థులు భారీ ర్యాలీలు, మానహారం నిర్వహించారు.
ఆదిలాబాద్, బెల్లంపల్లి, నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్‌లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, చిట్యాల, భువనగిరలో విద్యార్థులు భారీ ర్యాలీలు చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలో విద్యార్థి జేఏసీ భారీ ర్యాలీ నిర్వహించింది.












Click it and Unblock the Notifications