కోదండరామ్ జెఎసికి టిడిపి, కాంగ్రెసు ఎసరు

తెరాస చేతుల్లో ఉన్న జెఎసి కింద తాము ఎందుకు పనిచేయాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి శనివారం ప్రశ్నించారు. అటువంటి జెఎసిలో తాము ఎందుకు కొనసాగాలని ఆయన అడిగారు. విద్యావేత్త చుక్కా రామయ్యను జెఎసి చైర్మన్‌గా నియమిస్తే తాము సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత జెఎసి నేతృత్వంలో పనిచేయడానికి తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు నిరాకరిస్తున్నారు. జెఎసి వెనక నడవడానికి తాము గొర్రెలం కాదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సమిష్టి నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తేనే తాము జెఎసితో నడస్తామని ఆయన అన్నారు. కోదండరామ్ కెసిఆర్ ఆడించినట్లల్లా ఆడుతున్నాడని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications