చిరుకున్న దమ్ము వైయస్ జగన్‌కు లేదు: లగడపాటి

తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిది రెండు కళ్ల సిద్ధాంతమైతే వైయస్ జగన్‌ది రెండు చెవుల సిద్ధాంతమని ఆయన వ్యాఖ్యానించారు. ఓ పార్టీ అధినేతగా తెలంగాణపై జగన్ స్పష్టమైన వైఖరి వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసులో ఉన్నప్పుడు కచ్చితమైన వైఖరి చెప్పగల శక్తి ఉన్నప్పుడు పార్టీ పెట్టిన తర్వాత జగన్‌కు ఆ శక్తి ఎందుకు లేదని ఆయన పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డును ప్రదర్శించిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ అన్నారు. వైయస్సార్ అడుగుజాడల్లో నడుస్తానన్న వ్యక్తి జగన్ తెలంగాణపై ఎందుకు స్పష్టమైన వైఖరి చెప్పలేకపోయాడని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పలేనప్పుడు పార్టీ ఎందుకని ఆయన అడిగారు.
తాను పెట్టుబడిదారుడినే గానీ దోపిడీదారుడిని కానని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాలపై కాంగ్రెసుకు కచ్చితమైన వైఖరి ఉందని, చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలని కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)లో నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయం లేదని, తెలంగాణ వస్తుందనే నమ్మకం లేదని ఆయన అన్నారు. అయితే, తెలంగాణకు శాశ్వత పరిష్కారం త్వరలోనే లభిస్తుందని, త్వరలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటవుతుందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ రాజ్యం తెస్తానని చెప్పారే గానీ జగన్ రాజ్యం వస్తుందని చెప్పలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications