హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యుటిగా హైదరాబాదుకు మజ్లీస్ పార్టీ వ్యతిరేకత

By Pratap
|
Google Oneindia TeluguNews

Asaduddin Owaisi
హైదరాబాద్: కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాదును చేయాలనే ప్రతిపాదనను మజ్లీస్ వ్యతిరేకిస్తోంది. హైదరాబాదును కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతంగానో, హాంగ్‌కాంగ్‌లాగానో చేస్తే సమస్య పరిష్కారమవుతుందనే ఆలోచనకు దీంతో తీవ్రమైన విఘాతం కలిగింది. హైదరాబాదును కేంద్ర పాలితంగా ప్రాంతంగా చేయడానికి తాము వ్యతిరేకమని మజ్లీస్ అధినేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దానికి హైదరాబాదు రాజధానిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాము రాష్ట్ర విభజనకు వ్యతిరేకమైనప్పటికీ ఒకవేళ విభజించాల్సి వస్తే తెలంగాణ రాజధానిగా హైదరాబాదు ఉండాలని ఆయన అన్నారు.

తమ శానససభ్యులు ఎవరు కూడా రాజీనామా చేయరని కూడా ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అంశంపై తాము ఎన్నికల్లో పోటీ చేయలేదని, అందువల్ల తాము రాజీనామాలు చేసే ప్రసక్తి లేదని, తమ పార్టీ భిన్నమైందని, అటువంటివాటికి తాము దూరమని ఆయన అన్నారు. మజ్లీస్‌కు తప్ప మరే ఇతర రాజకీయ నాయకుడికి కూడా తెలంగాణలో మద్దతు లేదని ఆయన స్పష్టం చేశారు. శాసనసభలో ఉన్న ఏడుగురు ముస్లింలు కూడా తమ పార్టీకి చెందినవారేనని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పార్లమెంటుకు ఎన్నికైన ఏకైక ముస్లిం నేతను తానేనని ఆయన చెబుకున్నారు. అందువల్ల ముస్లింల గురించి తాము ఆలోచించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

English summary
Majlis-e-Ittehadul Muslimeen and Hyderabad Member of Parliament Asaduddin Owaisi said on Saturday night that he was opposed to the idea of making the City a Union Territory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X