వైయస్ జగన్ ఆస్తులపై చిరంజీవి మెగా కామెంట్స్

Chiranjeevi
హైదరాబాద్: అతి తక్కువ వ్యవధిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద మొత్తం ఎలా సంపాదించారో తేల్చాల్సిందేనని తిరుపతి శానససభ్యుడు చిరంజీవి అన్నారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆస్తుల కేసులో సీబీఐతో ప్రాథమిక విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశించటం న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకానికి, ప్రజాస్వామ్యం గొప్పతనానికి నిదర్శనమని ఆయన మంగళవారంనాడు ఓ ప్రకటనలో అన్నారు. స్వల్ప వ్యవధిలోనే జగన్ సంపాదన అనూహ్యంగా పెరిగిపోవటంతో ప్రజల్లో తలెత్తిన అనేక అనుమానాల నివృత్తికి సీబీఐతో ప్రాథమిక విచారణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

పారిశ్రామిక అవసరాలను చూపి ప్రభుత్వ భూములను కారుచౌకగా తీసుకున్న కొన్ని వ్యాపార సంస్థలు, జగన్ ప్రారంభించిన సంస్థల్లో అధిక ప్రీమియంతో షేర్లు కొనుగోలు చేయడం వెనుక వాస్తవాలు ఏమిటో తెలియాల్సి ఉందన్నారు. హైకోర్టు ఆదేశంతో సీబీఐ చేపట్టే ప్రాథమిక విచారణలో ఈ అంశాలన్నీ బయటికి వస్తాయన్న ఆశాభావాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+