'చంద్రబాబును జైల్లో పెట్టకపోవడమే వైయస్ తప్పు'

తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి కేటాయించిన భూములపై రాద్ధాంతం చేయడం వెనుక రాజకీయ కుట్రదాగివుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గోనె ప్రకాశ రావు వ్యాఖ్యానించారు చట్టం తెలియని వారు కూడా జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. నాడు కేటాయించిన భూములన్నీ మంత్రి వర్గం ఆమోదంతోనే జరిగాయని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. గతంలో 14 రాష్ట్రాల విభజన ఎలా జరిగిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కూడా అలాగే జరగాలని, ఈ విషయంపై ఆజాద్ చరిత్రను ఒకసారి తిరగేయాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రాల తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు రాజకీయ అజ్ఞానులన్నారు.












Click it and Unblock the Notifications