హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు, టిఆర్ఎస్‌ను ఇరుకున పెడుతున్న టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెసు పార్టీని ఇరుకున పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ తెలంగాణ ప్రాంతంలో నిస్తేజంగా కనిపించిన టిటిడిపి రాజీనామాలతో ఒక్కసారిగా ఊపుమీదకు వచ్చింది. కాంగ్రెసు పార్టీ రాజీనామాలు చేస్తేనే తామంతా చేస్తామని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ జూలై 4నఅనూహ్యంగా కాంగ్రెసు పార్టీ వారి కంటే ముందుగానే రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభానికి తామే కారణమన్న పరిస్థితిని ప్రజలలోకి తీసుకు వెళ్లి పోయింది. రాజీనామాలు చేసిన తర్వాత సైతం కాంగ్రెసు, టిఆర్ఎస్‌లపై విచిత్ర అస్త్రాన్ని ప్రయోగించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసమే రాజీనామాలు చేసినట్లయితే తెలంగాణ వచ్చే వరకు మళ్లీ ఎన్నికలలో పోటీ చేయవద్దని డిమాండ్ చేస్తూ వస్తుంది.

రాజీనామాలు చేయకుముందు నుండి ఇప్పుడు నిర్వహిస్తున్న బస్సుయాత్ర వరకు టిడిపి మళ్లీ పోటీ చేయకూడదని కాంగ్రెసు, టిఆర్ఎస్‌లకు సవాల్ విసురుతూ వారిని ఇరుకున పెట్టే స్థితికి చేరుకుంది. రాజీనామాలకు ముందు పూర్తిగా కనుమరుగైన టిడిపిలో రాజీనామాల తర్వాత కొత్త ఊపు కనిపిస్తుండటం, బస్సుయాత్రకు ప్రజలు భారీగా తరలి వస్తుండటంతో రాజకీయ పరిశీలకులు సైతం టిడిపి పుంజుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. తెలంగాణ కోసమంటూ రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు పోయి మళ్లీ వారే గెలుపొందటం వల్ల ఉపయోగం లేదని, ఇప్పటికే టిఆర్ఎస్ పలుమార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోయి సాధించిందేమీ లేదని టిడిపి ప్రజల్లోకి తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Congress and Telangana Rastra Samithi in crisis with Telugudesam party attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X