హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో తీవ్రవాది అరెస్టు?, విచారణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాజధాని నగరంలో తీవ్రవాదిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. మౌలాలీ హౌజింగ్ బోర్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఫజి అనే వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఫజికి తీవ్రవాదులతో సంబంధాలు ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫజిని అరెస్టు చేసిన పోలీసులు అతనిని విచారిస్తున్నారు. తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా, ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడు తదితర విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు.

కాగా ముంబైలో వరుస పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదు, అంతర్జాతీయంగా పేరుగాంచిన పుణ్యక్షేత్రం తిరుపతితో పాటు ముఖ్యమైన ప్రాంతాలలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమానంగా ఉన్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి విచారిస్తున్నారు.

English summary
Police arrest a young in Hyderabad by suspecting he links with terrorists. Police enquiring him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X