లగడపాటి, వర్మ మాటిచ్చారు: వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi
విజయవాడ: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ బెజవాడ రౌడీలు చిత్రం టైటిల్‌ మార్పుపై మాట ఇచ్చారని తెలుగుదేశం పార్టీ యువనేత వల్లభనేని వంశీ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. బెజవాడ రౌడీలు టైటిల్ మార్చుతామని ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఆయన స్నేహితుడు లగడపాటి తమకు మాట ఇచ్చారని అందుకే చిత్రం షూటింగును యథావిధిగా నడవనిస్తున్నామని వంశీ అన్నారు. వారు మార్చుతామని చెప్పకుంటే చిత్రీకరణను అడ్డుకునే వారిమని చెప్పారు.

చిత్రం పేరును మార్చక పోతే థియేటర్లలో ప్రదర్శనను మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ అడ్డుకుంటామని వంశీ హెచ్చరించారు. కాగా వర్మ నిర్మిస్తున్న బెజవాడ రౌడీలు చిత్రం షూటింగ్ చుట్టూ గత కొంతకాలంగా వివాదం చుట్టుకున్న విషయం తెలిసిందే. బెజవాడ రౌడీలు చిత్రంపై బెజవాడ ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలు, స్థానిక ప్రజలు అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+